Jeevithaanthamu Varaku Nekae –Saeva Salpudu Nantini = Neevu Naatho Nundi
Dhairyamun- Eicchi Nadupumu Rakshakaa ||Jeevithaanthamu||
1.Enni Aatankambulunnanu –Enni Bhayamulu Kaligina = Anni Poavunu Neevu Naakada –
Unna Nijamidhi Rakshakaa ||Jeevithaanthamu||
2.Anni Vaelala Neevu Chenthane – Unna Anubhabhava Miiyave – Thinnagaa Ne
Maargamanduna – Puuni Nadachedha Rakshakaa ||Jeevithaanthamu||
3.Naethramulu Miru Mitlu Golipedi- Chitra Drusyamu Lunnanu- = Satruvagu Saathaanu
Gelvanu Chaalu Ne Krupa Rakshakaaa ||Jeevithaanthamu||
4.Naadhu Hrudhayamu Nandhu Velupata –Aavarinchina Sathrulan = Chedhara Gottumu
Ruupu Maapumu – Siighramuga Naa Rakshakaa ||Jeevithaanthamu||
5.Mahimaloa Ne Vundu Choatiki Mammu Chaerchedha Nantivae = Eihamu Dhaatina Dhaaka
Ninnu – Viida Nantini Rakshakaa ||Jeevithaanthamu||
6.Paapa Maargamu Dhariki Poavaka – Paatha Aasala Koaraka -= Epudu Ninnae
Vembadimpaga – Krupa Nosangumu Rakshakaa ||Jeevithaanthamu||
జీవితాంతము వరకు నీకే –సేవ సల్పుదు నంటిని =
నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి నడుపుము రక్షకా ||జీవితాంతము||
1.ఎన్ని ఆటంకంబులైనను –ఎన్ని భయములు కలిగినా =
అన్ని పోవును నీవు నాకడ – ఉన్న నిజమిది రక్షకా ||జీవితాంతము||
2.అన్ని వేళల నీవు చెంతనే – ఉన్న అనుభవ మీయవే –
తిన్నగా నీ మార్గమందున – పూని నడచెద రక్షకా ||జీవితాంతము||
3.నేత్రములు మిరు మిట్లు గొలిపెడి- చిత్ర దృశ్యము లున్ననూ- =
శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా ||జీవితాంతము||
4.నాదు హృదయము నందు వెలుపట –ఆవరించిన శత్రులన్ =
చెదర గొట్టుము రూపు మాపుము – శీఘ్రముగ నా రక్షకా ||జీవితాంతము||
5.మహిమలో నే నుండు చోటికి మమ్ము చేర్చెద నంటివే =
ఇహము దాటిన దాక నిన్ను – వీడ నంటివి రక్షకా ||జీవితాంతము||
6.పాప మార్గము దరికి పోవక – పాత ఆశలు కోరకా -=
ఎపుడు నిన్నే వెంబడింపగ – కృప నొసంగుము రక్షకా ||జీవితాంతము||