Aha Mahatmaha Sarnya

ఆహా మహాత్మహా శరణ్యా – హా విమోచకా = ద్రోహ రహిత
చంపె నిను నా – దేషమేగదా

1. ‘వీరలను క్షమించు తండ్రి – నేర మేమియున్‌’ = కోరి తిటులు
నిన్ను జంపు – క్రూర జనులకై

2. ‘నీవు నాతో బరదైసున – నేడే యుందువు’ = పావనుండ
యిట్లు బలికి – పాపి గాచితి

3. ‘అమ్మా! నీ సుతుడ’ టంచు మరి – యమ్మతోబలికి = క్రమ్మర
‘నీ జనని’ యంచు – గర్త నుడితివి

4. ‘నా దేవ దేవ యేమి విడ – నాడితి’ వనుచు = శ్రీదేవ సుత
పలికితివి శ్రమ – చెప్ప శక్యమా

5. ‘దప్పికొనుచున్నాన’ టంచు జెప్పితివి – గద = యిప్పగిదిని
బాధ నొంద – నేమి నీకు హా !

6. శ్రమ ప్రమాదములలో గొప్ప – శబ్దమెత్తి హా = ‘సమాప్తమైన’
దంచు దెలిపి – సమసితివి గదా

7. ‘అప్పగింతుౌ దండ్రి నీకు – నాత్మ’ నంచును = గొప్ప
యార్భాటంబు చేసి – కూలిపోతివా