Bhayamunu Para Droledi Yesu Puttenu

భయమును పార ద్రోలేడి యేసు పుట్టెను ఈ లోకంలో
ఆనందాన్ని పంచేడి యేసు వెలసెను భూలోకంలో

నీ కొరకే నా కొరకే వచ్చాడు ఆ యేసయ్యా
పరలోకాన్ని భూలోకంపై తెచ్చాడు మన యేసయ్యా

1. దేవుడు నిన్ను ఎంతో ప్రేమించి పంపాడు మన క్రీస్తును
నీవు నశించక నిత్యం జీవించుటకుTe చేసాడు ఒక మార్గము
ఆ మార్గమే సత్యం జీవం నిత్యమైన మోక్ష మార్గం
సంపూర్ణ హృదయంతో అంగీకరించిన
నిశ్చయము నిత్య జీవము

2. ఈలోక సంపద ఇహలోక ప్రేమలు ఒకరోజు విడిచిపోవును
పరలోక సంపద యేసయ్య ప్రేమయే శాశ్వత కాలం నిలచును
ఈరోజే నీవు అంగీకరించిన విడువడు ఎడబాయడు నిన్ను
ఇమ్మానుయేలైన యేసయ్య వాక్కు ఎల్లప్పుడు నడుపును నిన్ను

3. సమస్త భారము మోయుచున్నవారిని పిలచుచుండె యేసయ్యా
తనయొద్దకు వచ్చువాని ఎంతమాత్రము త్రోసివేయడెప్పుడైనను
మనుష్యుల పట్టే జాలరిగా – చేయగలడు నిన్నూ నన్నూ (2)
లోకానికి వెలుగునిచ్చు జ్యోతులుగా – లోబడుటకు సిద్ధపరచును (2)