Where Families Grow Together

Chudumu Gethsemane

చూడుము గెత్సెమనె – తోటలో నా ప్రియుడు
పాపి నాకై విజ్ఞాపన చేసెడి – ధ్వని వినబడుచున్నది

1.దేహమంతయు నలిగి – శోకము నొందినవాడై
దేవాది దేవుని ఏకసుతుడు పడు – వేదనలు నా కొరకే
…చూడుము…

2.తండ్రి యీ పాత్ర తొలగన్ – నీ చిత్తమైన యెడల
ఎట్లయినను నీ చిత్తము చేయుటకు – నన్నప్పగించితివనెను
…చూడుము…

3.రక్తపు చెమట వలన – మిక్కిలి బాధనొంది
రక్షకుడేసు హృదయము పగులగ – విజ్ఞాపనము జేసెనే
…చూడుము…

4.ముమ్మారు భూమి మీద – పడి మిక్కిలి వేదనచే – మన
యేసు ప్రభువు తానే వేడుకొనెను – పాపుల విమోచన కొరకే
…చూడుము…

5.ప్రేమతో కూడిన వాక్కులచే – ఆదరించెడి ప్రభువు
వేదన సమయమున ఆదరించువారు – లేక బాధనొందెను
…చూడుము…

6.నన్ను తన వలె మార్చెడి – ఈ మహా ప్రేమను
తలచి తలచి హృదయము కరుగగా – నే సదా కీర్తించెదను