Where Families Grow Together

Junte Thene Kanna Thiyanidhi

Junte Thene Kanna Thiyanidhi, Vendi Pasidi Kanna Minna Adhi
Pongi Porluchunna Prema Nidhi, Yesu Nee Namamu
Surya Kaanthi Kanna Prakasa Mainadhi, Pandu Vennela Kanna Nirmala Mainadhi
Manchu Kondala Kanna Challanidhi, Yesu Nee Namamu

Yesu Asadyudavu Neevu, Maranane Jayinchina Veerudavu
Sarvane Sasinche Yodhudavu, Neeku Saati Lerevaru
Rakshaka Neeve Ga Na Balamu, Deeva Maa Daagu Sthalamu Neeve
Neeve Nijamaina Deevudavu, Pranamilli Mrokedanu

Akasamu Kanna Visala Mainadhi, Visva Manthatilo Vyapinchi Yunadhi
Ohala Kandani Vunnatha Mainadhi, Yesu Nee Namamu
Lokamanthatiki Rakshana Margamu, Janulandarini Bratikinchu Jeevamu
Sarva Kaalamulalo Nivasinchu Satyamu, Yesu Nee Namamu

జుంటె తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్న అది
పొంగి పొర్లుచున్న ప్రేమ నిధి, యేసు నీ నామము
సూర్య కాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్న నిర్మలమైనది
మంచు కొండలకన్న చల్లనిది, యేసు నీ నామము

యేసూ అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు
సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు
రక్షకా నీవేగా నా బలము, దేవా మా దాగుస్థలము నీవే
నీవే నిజమైన దేవుడవు, ప్రణమిల్లి మ్రొక్కెదను

ఆకాశముకన్న విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించియున్నది
ఊహలకందని ఉన్నతమైనది, యేసు నీ నామము
లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరిని బ్రతికించు జీవము
సర్వకాలములలో నివసించు సత్యము, యేసు నీ నామము || యేసూ ||