Maa Goppa Deva – Mamu Karuninchi

Maa Goppa Deva – Mamu Karuninchi
Athyunnatha Sthaanamulo Nanu Nilipavu
Yogyudane Kaanu aa Premaku
Vela Kattalenu aa Premaku

Aradhinchedanu Naa Poorna Hrudayamutho
Ninne Keerthinthunu Naa Jeevithamantha

(Nemmadhe Leni Brathukulo
Paapapu Bandhakaalalo
Chikkiyunna Nannu Neevu Vidipinchavu)(2)
Paapam lo Nundi Nanu Vimochinchutaku
Aa Ghora Siluvalona Maraninchavu
Dhaasathvamu Nandhe Padiyunna Nannu
Nee Kumaruniga Hechchinchavu||Ma Goppa Deva||

(Maarpu leni Brathukulo
Malinamaina Manasutho
Ne Thoolanaadi Dhooshinchindhi Ninne ega)(2)
Aa Sthithilo Kuda Nanu Preminche Goppa
Hrudayam Needhe Yesayya
Na lanti Ghoramaina Paapini Kuda
Kshamiyinchi Preminchindhi Neevenayya ||Ma Goppa Deva||

మా గొప్ప దేవా – మము కరుణించి
అత్యున్నత స్థానములో నను నిలిపావు
యోగ్యుడనే కాను ఆ ప్రేమకు
వెల కట్టలేను ఆ ప్రేమకు

ఆరాధించెదను నా పూర్ణ హృదయముతో
నిన్నే కీర్తింతును నా జీవితమంతా

(నెమ్మదే లేని బ్రతుకులో
పాపపు బంధకాలలో
చిక్కియున్న నన్ను నీవు విడిపించావు)(2)
పాపం లో నుండి నను విమోచించుటకు
ఆ ఘోర సిలువలోన మరణించావు
దాసత్వము నందే పడియున్న నన్ను
నీ కుమారునిగా హెచ్చించావు ||మా గొప్ప దేవా||

(మార్పులేని బ్రతుకులో
మలినమైన మనసుతో
నే తూలనాడి దూషించింది నిన్నే ఏగా)(2)
ఆ స్థితిలో కూడా నను ప్రేమించే గొప్ప
హృదయం నీదే యేసయ్య
నా లాంటి ఘోరమైన పాపిని కూడా
క్షమియించి ప్రేమించింది నీవేనయ్యా ||మా గొప్ప దేవా||