Sannuthinthu Yesu Swami Ninnu Anudhinam

Sannuthinthu Yesu Swami Ninnu Anudhinam, Nee Mahathya Kaaryamulanu Paadi Vivarinthunu (X2)
Shodana Vedana Kashta Samayana, Naa Thoduga Nundhuvu
Aascharya Kaaryamulu Ananda Gadiyalu, Ennadu Maruvanu ||Sannuthinthu||

1. Samadhilo Nundi Naa Pranamu Vichochinchi Yunnavu
Karuna Katashmulu Kiritamuga Naa Kichhi Yunnavu (X2)
Naa Doshamulannitini Kshamiyichinaavu, Karuna Samrudhudavu
Melulatho Naa Hrudayam Thrupthi Parachaavu, Neekemi Chellinthunu ||Sannuthinthu||

2. Mahim-Aishwarmula Maharaja, Mahima Tho Nimpunu
Shanti Rajya Sthapakudu, Thana Shanti Nichunu
Adigina Vaatini Kadhana Kuda, Varamulu Kuripinchunu
Yesayya Ni Goppa Namamunu Smariyimpa, Maakentho Bhagyamu ||Sannuthinthu||

సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం, నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2)
శోధన వేదన కష్ట సమయాన, నా తోడుగ నుందువు
ఆశ్చర్య కార్యములు ఆనంద గడియలు, ఎన్నడు మరువను ||సన్నుతింతు||

1.సమాధిలో నుండి నా ప్రాణము విమోచించి యున్నావు
కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చి యున్నావు (2)
నా దోషములన్నిటిని క్షమియించినావు, కరుణా సమృద్ధుడవు
మేలులతో నా హృదయం తృప్తి పరచావు, నీకేమి చెల్లింతును ||సన్నుతింతు||

2.మహిమైశ్వర్యముల మహరాజు, మహిమతో నింపును
శాంతి రాజ్య స్థాపకుడు, తన శాంతినిచ్చును (2)
అడిగినవాటిని కాదనకుండ, వరములు కురిపించును
యేసయ్యా నీ గొప్ప నామము స్మరియింప, మాకెంతో భాగ్యము ||సన్నుతింతు||