Andala tara arudenche naaki

పల్లవి:    అందాల తార అరుదెంచె నాకై – అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో – అమరకాంతిలో
ఆది దేవుని జూడ – అశింపమనసు – పయనమైతిమి                             .. అందాల తార..

  1. విశ్వాసయాత్ర – దూరమెంతైన – విందుగా దోచెను
    వింతైన శాంతి – వర్షంచెనాలో – విజయపధమున
    విశ్వాలనేలెడి – దేవకుమారుని – వీక్షించు దీక్షలో
    విరజిమ్మె బలము – ప్రవహించె ప్రేమ – విశ్రాంతి నొసగుచున్   .. అందాల తార..
  2. యెరూషలేము – రాజనగరిలో – ఏసును వెదకుచు
    ఎరిగిన దారి – తొలగిన వేల – ఎదలో క్రంగితి
    ఏసయ్యతార – ఎప్పటివోలె – ఎదురాయె త్రోవలో
    ఎంతో యబ్బురపడుచు – విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు      .. అందాల తార..
  3. ప్రభుజన్మస్ధలము – పాకయేగాని పరలోక సౌధమే
    బాలునిజూడ – జీవితమెంత – పావనమాయెను
    ప్రభుపాదపూజ – దీవెనకాగా – ప్రసరించె పుణ్యము
    బ్రతుకె మందిరమాయె – అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన            .. అందాల తార..