Jaya Jaya Yesu Jaya Yesu

జయ జయ యేసు జయయేసు – జయ జయ క్రీస్తు జయక్రీస్తు
జయ జయ రాజా జయరాజా – జయ జయ స్తోత్రం జయస్తోత్రం

1. మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను జయయేసు
పరమ బలమొసగు జయయేసు శరణము నీవె జయయేసు

2. సమాధి గెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు
క్షమియించుము నను జయయేసు అమరమూర్తివి జయయేసు

3. సాతాను గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు
పాతవి గతియించె జయయేసు దాతవు నీవె జయయేసు

4. బండను గెల్చిన జయయేసు బండయు ఓడెను జయయేసు
బండలుదీయుము జయయేసు అండకు జేర్చుము జయయేసు

5. ముద్రను గెల్చిన జయయేసు ముద్రయు ఓడెను జయయేసు
ముద్రలుజీల్చుము జయయేసు ముద్రించుము నను జయయేసు

6. కావలిగెల్చిన జయయేసు కావలి ఓడెను జయయేసు
సేవలో బలమును జయయేసు జీవమునీవె జయయేసు

7. దయ్యాల గెల్చిన జయయేసు దయ్యాలు ఓడెను జయయేసు
కయ్యము గెల్చిన జయయేసు సాయం నీవె జయయేసు