Siluva Chentha Cherina Nadu

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి

1. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన పిలుచుచుండె పరముచేర

2. వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబది తొమ్మిది గొర్రెల విడచి – ఒంటరియైున గొర్రెను వెదకెన్‌

3. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయె
తప్పు తెలిసి తిరిగిరాగా – తండ్రి యతని జేర్చుకొనెను

4. పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేర
పాపుల గతిని పరికించితివా – పాతాళంబే వారి యంతం

siluvachenta chearinanaaDu kaluSamulanu kaDigiveayu (2)
poulu valenu seela valenu (2) – siddapaDina bhaktula joochi (2) ||siluva||

konDalaanTi banDalaanTi monDi hRdayamulanu manDinchu (2)
panDiyunna paapulanaina (2) – pilachuchunDe paramujeara (2) ||siluva||

vandagorrela mandaloanunDi okati tappi onTariyaaye (2)
tombadi tommidi gorrela viDachi (2) – onTariyaina gorrenu vedaken (2) ||siluva||

tappipoayina kumaarunDu – tanDrini viDachi taralipoaye (2)
tappu telisi tirigiraagaa (2) – tanDriyatani jearchukoniye (2) ||siluva||