Sree Yesundu Janminche Reyilo Chords

D               A   D
శ్రీ యేసుండు జన్మించే రేయిలో
    A     D       A   D
నేడు పాయక బెత్లెహేము యూరిలో       ||శ్రీ యేసుండు||

D              A      D
కన్నియ మరియమ్మ గర్భమందున
 A     D     A        D
ఇమ్మానుయేలనెడి నామమందున        ||శ్రీ యేసుండు||

D                A       D
సత్రమందున పశువుల శాల యందున
   A      D     A        D
దేవపుత్రుండు మనుజుండాయెనందున     ||శ్రీ యేసుండు||

D             A   D
పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబడి
     A     D     A   D
పశుల తొట్టిలో పరుండ బెట్టబడి        ||శ్రీ యేసుండు||

D             A   D
గొల్లలెల్లరు మిగుల భీతిల్లగ
     A   D       A  D
దెల్పె గొప్ప వార్త దూత చల్లగ         ||శ్రీ యేసుండు||

D               A   D
మన కొరకొక్క శిశువు పుట్టెను
     A      D     A  D
ధరను మన దోషముల బోగొట్టను      ||శ్రీ యేసుండు||

D             A   D
పరలోకపు సైన్యంబు గూడెను
     A     D       A  D
మింట వర రక్షకుని గూర్చి పాడెను    ||శ్రీ యేసుండు||

D              A   D
అక్షయుండగు యేసు వచ్చెను
      A   D    A  D
మనకు రక్షణంబు సిద్ధపర్చెను       ||శ్రీ యేసుండు||