Where Families Grow Together

Basillenu Siluvalo Papa Kshama

భాసిల్లెను సిలువలో పాపక్షమ యేసుప్రభూ నీ దివ్యక్షమ

1. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను ఆహుతి జేసె
కలుషహరా కరుణించితివి

2. దోషము జేసినది నేనెగదా మోసముతో బ్రతికిన నేనెగదా
మోసితివా నా శాప భారం

3. పాపము జేసి గడించితి మరణం శాపమెగా నేనార్జించినది
కాపరివై నను బ్రోచితివి

4. నీ మరణపు వేదన వృధగాదు నా మదివేదనలో మునిగె
క్షేమము కలిగిను హృదయములో

5. ఎందులకో నాపై ఈ ప్రేమ అందదయా స్వామీ నా మదికి
అందులకే భయమొందితిని

6. నమ్మినవారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని
నమ్మితి నీ పాదమ్ములను