Where Families Grow Together

Rajulaku Rajina Eee Mana Vibhuni

రాజులకు రాజైన యీ మన విభుని పూజ సేయుటకు రండి
యీ జయశాలి కన్న మనకింక రాజెవ్వరును లేరని

1. కరుణ గల సోదరుండై యీయన ధరణి కేతెంచెనయ్యా
స్థిరముగా నమ్ముకొనిన మనకొసగు బరలోక రాజ్యమ్మును

2. నక్కలకు బొరియలుండె నాకాశ పక్షులకు గూళ్లుండెను
ఒక్కింత స్థలమైనను మన విభుని కెక్కడ లేకుండెను

3. అపహాసములు సేయుచు నాయన యాననముపై నుమియుచు
గృపమాలిన సైనికు లందరును నెపము లెంచుచు గొట్టిరి

4. కరమునందొక్క రెల్లు పుడకను దిరముగా నునిచి వారల్‌
ధరణీపతి శ్రేషుడ నీకిపుడు దండమనుచును మ్రొక్కిరి

5. ఇట్టి శ్రమలను బొందిన రక్షకుని బట్టుదలతో నమ్మిన
అట్టహాసము తోడను బరలోక పట్టణంబున జేర్చును

6. శక్తిగల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము జేసెను
భక్తితో ప్రార్ధించిన మన కొసగు రక్తితో నా ముక్తిని

7. త్వరపడి రండి రండి యీ పరమ గురుని యొద్దకు మీరలు
దరికి జేరిన వారిని మన ప్రభువు దరుమడెన్నడు దూరము