Entho Vintha Entho Chinta

ఎంతో వింత యెంతో చింత యేసునాధు మరణ మంత (2) పంతము తో జేసి రంత సొంత ప్రజలు స్వామి నంత (2) ||ఎంతో|| పట్టి కట్టి నెట్టి కొట్టి తిట్టి రేసు నాధు నకటా (2) అట్టి శ్రమల నొంది పలుక డాయె యేసు స్వామి నాడు (2) ||ఎంతో|| మొయ్యలేని మ్రాను నొకటి మోపి రేసు వీపు పైని (2) మొయ్యలేక మ్రాని తోడ మూర్చబోయే నేసు తండ్రి (2) ||ఎంతో|| కొయ్యపై నేసయ్యన్…

Yuda Raja Simham Thirigi Lechenu

యూదా రాజ సింహం – తిరిగి లేచెను తిరిగి లేచెను – మృతిని గెలిచి లేచెను యూదా రాజ సింహం – యేసుప్రభువే యేసుప్రభువే – మృతిని గెలిచి లేచెను యూదా రాజ సింహం – తిరిగి లేచెను 1. నరక శక్తులన్నీ – ఓడిపోయెను ఓడిపోయెను – అవన్నీ రాలిపోయెను 2. యేసు లేచెనని -రూఢియాయెను రూడియాయెను – సమాధి ఖాళీ ఆయెను 3. పునరుత్థానుడిక – మరణించడు మరణించడు – మరెన్నడు మరణించడు 4.…

Siluvalo Sagindi Yaathra Karunamayuni

సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 1. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే 2. చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపై ఊసింది మరియొకరు బంతులాడినారు బాధలలో వేసినారు నోరు తెరువలేదాయె ప్రేమ…

Hey Prabhu Yesu Hey Prabhu Yesu

హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా శాంతికరా 1. శాంతి సమాధానాధిపతి స్వాంతములో ప్రశాంతనిధి శాంతి స్వరూపా జీవనదీపా శాంతి సువార్తనిధి 2. తపములు తరచిన నిన్నెగదా జపములు గొలిచిన నిన్నెకదా విఫలులు జేసిన విజ్ఞాపనలకు సఫలత నీవెగదా 3. మతములు వెదకిన నిన్నెగదా – వ్రతములు గోరిన నిన్నెగద పతితులు దేవుని సుతులని చెప్పిన హితమతి నీవెగదా 4. పలుకులలో నీ శాంతికధ తొలకరి వానగ కురిసెగదా మలమలమాడిన మానవ…

Jaya Jaya Yesu Jaya Yesu

జయ జయ యేసు జయయేసు – జయ జయ క్రీస్తు జయక్రీస్తు జయ జయ రాజా జయరాజా – జయ జయ స్తోత్రం జయస్తోత్రం 1. మరణము గెల్చిన జయయేసు మరణము ఓడెను జయయేసు పరమ బలమొసగు జయయేసు శరణము నీవె జయయేసు 2. సమాధి గెల్చిన జయయేసు సమాధి ఓడెను జయయేసు క్షమియించుము నను జయయేసు అమరమూర్తివి జయయేసు 3. సాతాను గెల్చిన జయయేసు సాతాను ఓడెను జయయేసు పాతవి గతియించె జయయేసు దాతవు నీవె…

Aha Mahatmaha Sarnya

ఆహా మహాత్మహా శరణ్యా – హా విమోచకా = ద్రోహ రహిత చంపె నిను నా – దేషమేగదా 1. ‘వీరలను క్షమించు తండ్రి – నేర మేమియున్‌’ = కోరి తిటులు నిన్ను జంపు – క్రూర జనులకై 2. ‘నీవు నాతో బరదైసున – నేడే యుందువు’ = పావనుండ యిట్లు బలికి – పాపి గాచితి 3. ‘అమ్మా! నీ సుతుడ’ టంచు మరి – యమ్మతోబలికి = క్రమ్మర ‘నీ జనని’…

Siluve Na Saranayenura

సిలువే నా శరణాయెనురా – నీ సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము జూచితిరా 1. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా 2. సిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు నలిగి కరిగి నీరగు చున్నది రా 3. సిలువను దరచి తరచి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ జాలును రా 4. పలువిధ పదము లరసి ఫలితమేమి గానలేక సిలువ యెదుటను…

Siluva Chentha Cherina Nadu

సిలువ చెంత చేరిననాడు కలుషములను కడిగివేయు పౌలు వలెను సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి 1. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు పండియున్న పాపులనైన పిలుచుచుండె పరముచేర 2. వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయె తొంబది తొమ్మిది గొర్రెల విడచి – ఒంటరియైున గొర్రెను వెదకెన్‌ 3. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయె తప్పు తెలిసి తిరిగిరాగా – తండ్రి యతని జేర్చుకొనెను 4. పాపిరావా పాపము విడచి…