Manakai yeasu maraninche

మనకై యేసు మరణించె మన పాపముల కొరకై
నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయె (2)

తృణీకరింపబడె – విసర్జింపబడెను (2)
దుఃఖాక్రాంతుడాయె వ్యసనముల భరించెను (2) ||మనకై||

మన యతిక్రమముల కొరకు – మన దోషముల కొరకు (2)
మన నాథుడు శిక్షనొందె – మనకు స్వస్థత కలిగె (2) ||మనకై||

గొర్రెలవలె తప్పితిమి – పరుగిడితిమి మనదారిన్ (2)
అరుదెంచె కాపరియై – అర్పించి ప్రాణమును (2)||మనకై||

దౌర్జన్యము నొందెను – బాధింపబడెను (2)
తననోరు తెరువలేదు – మనకై క్రయధనమీయన్ (2)

manakai yeasu maraNinche mana paapamula korakai
nityajeevamu nichchuTakea satyunDu sajeevuDaaye (2)

tRNeekarimpabaDe – visarjimpabaDenu (2)
du@hkhaakraantuDaaye vyasanamula bharinchenu (2) ||manakai||

mana yatikramamula koraku – mana doashamula koraku (2)
mana naathuDu Sikshanonde – manaku swasthata kalige (2) ||manakai||

gorrelavale tappitimi – parugiDitimi manadaarin (2)
arudenche kaapariyai – arpinchi praaNamunu (2)||manakai||

dourjanyamu nondenu – baadhimpabaDenu (2)
tananoaru teruvaleadu – manakai krayadhanameeyan (2) ||manakai||