Siluvalo Sagindi Yaathra Karunamayuni

సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే

1. పాలుగారు దేహముపైన పాపాత్ముల కొరడాలెన్నో
నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే

2. చెళ్ళుమని కొట్టింది ఒకరు ఆ మోముపై ఊసింది మరియొకరు
బంతులాడినారు బాధలలో వేసినారు
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే

3. వెనుకనుంచి తన్నింది ఒకరు తనముందు నిలచి నవ్వింది మరియొకరు
గేలిచేసినారు పరిహాసమాడినారు
నోరు తెరువలేదాయె ప్రేమ బదులు పలుకలేదాయె ప్రేమ
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే

4. దాహమని అడిగింది ప్రేమ చేదు దాహాన్ని ఇచ్చింది లోకం
చిరకనిచ్చినారు మరి బరిసెతో గుచ్చారు