కొనియాడఁ దరమె నిన్ను – కోమల హృదయ – కొనియాడఁ దరమె నిన్ను
తనరారు దినకరు – బెనుతారలను మించు – ఘనతేజమున నొప్పు – కాంతిమంతుఁడ వీవు ||కొని||
1. ఖేరుబులు సెరుపులు – మరి దూత గణములు = నూరుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొని||
2. సర్వలోకంబులఁ – బర్వు దేవుడ వయ్యు = నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొని||
3. విశ్వమంతయు నేలు వీరాసనుడ వయ్యు = పశ్వాళితోఁ దొట్టి – పండియుంటివి నీవు ||కొని||
4. దోసంబులను మడియు – దాసాళి గరుణించి = యేసుపేరున జగతి కేగుదెంచితినీవు ||కొని||
5. నరులయందున గరుణ – ధర సమాధానంబు = చిరకాలమును మహిమ పరగ జేయుదు వీవు ||కొని||
6. ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేగొని = శ్రేయముగ బవళించు శ్రీకర వరసుత ||కొని||