doota paaTa paaDudi – rakshakun stutinchuDi
aa prabhunDu puTTenu – betleheamunandunan
bhoojamanbu kellanu – soukhya sambhramaayenu
aakasambunanduna – mroagu paaTa paaDuDi
doota paaTa paaDuDi – rakshakun stutinchuDi
oordhvaloakamanduna – golvagaanu Suddulu
antyakaalamanduna – kanyagarbhamanduna
buTTinaTTi rakshakaa – oa immaanuyeal prabhoa
oa naraavataaruDaa – ninnu nenna Sakyamaa?
dootapaaTa paaDuDi – rakshakun stutinchuDi
raave neeti sooryuDaa – raave deavaputruDaa
needu raakavallanu – loaka soukhyamaayenu
bhoonivaasulandaru – mRtyubheeti gelturu
ninnu nammuvaariki naatmaSuddi kalgunu
doota paaTa paaDuDi – rakshakun stutinchuDi
దూత పాట పాడుది – రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను – బెత్లెహేమునందునన్
భూజమంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను
ఆకసంబునందున – మ్రోగు పాట పాడుడి
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
ఊర్ధ్వలోకమందున – గొల్వగాను శుద్దులు
అంత్యకాలమందున – కన్యగర్భమందున
బుట్టినట్టి రక్షకా – ఓ ఇమ్మానుయేల్ ప్రభో
ఓ నరావతారుడా – నిన్ను నెన్న శక్యమా?
దూతపాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి
రావె నీతి సూర్యుడా – రావె దేవపుత్రుడా
నీదు రాకవల్లను – లోక సౌఖ్యమాయెను
భూనివాసులందరు – మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి నాత్మశుద్ది కల్గును
దూత పాట పాడుడి – రక్షకున్ స్తుతించుడి