andaala aaSaakiraNam – Dendaala cheekaTi baapen
udayinche chooDu sadayunDu yeasu – nija santasa krismas neaDu
yuvatara bhavitavyam yeasea – navatara chaitanyam yeasea
prabhavinchenu diviraajyam dharaloa – prabhuvinchchenu SubhasandeaSam
darileani dooraalaloa – gurileani valayaalaloa
tirugaaDu maanavulaku toaDai – bhariyinchun palu bhaaramulan
aruNoadaya darSanamidiyea – asamaana teajoamayuDea
arudenchenu aaScharyakaruDai – andinchenu adbhuta preaman
అందాల ఆశాకిరణం – డెందాల చీకటి బాపెన్
ఉదయించె చూడు సదయుండు యేసు – నిజ సంతస క్రిస్మస్ నేడు
యువతర భవితవ్యం యేసే – నవతర చైతన్యం యేసే
ప్రభవించెను దివిరాజ్యం ధరలో – ప్రభువించ్చెను శుభసందేశం
దరిలేని దూరాలలో – గురిలేని వలయాలలో
తిరుగాడు మానవులకు తోడై – భరియించున్ పలు భారములన్
అరుణోదయ దర్శనమిదియే – అసమాన తేజోమయుడే
అరుదెంచెను ఆశ్చర్యకరుడై – అందించెను అద్భుత ప్రేమన్