సిలువే నా శరణాయెనురా – నీ సిలువే నా శరణాయెను రా సిలువ యందే ముక్తి బలము జూచితిరా 1. సిలువను వ్రాలి యేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితి రా 2. సిలువను చూచుకొలది శిల సమానమైన మనస్సు నలిగి కరిగి నీరగు చున్నది రా 3. సిలువను దరచి తరచి విలువ కందగరాని నీ కృప కలుషమెల్లను బాపగ జాలును రా 4. పలువిధ పదము లరసి ఫలితమేమి గానలేక సిలువ యెదుటను…