Sree rakshakunDu puTTagaa-naakaaSasainyamu
ihambuna keatenchuchu-ee paaTa paaDenu
parambunandu swaamiki-mahaa prabhaavamu
ihambunandu Saantini-vyaapimpaneeyuDu
aa ramyamaina gaanamu-ee veaLa mroagunu
santushTulaina bhaktulu-aa dhvani vinduru
prayaasapaDu prajalu-du@hkhambu teeragaa
aa Sraavyamaina gaanamu-ee veaLa vinduru
poorvambu dootagaanamu-bhuvin vinambaDi
renDuveala varshamulu-gatinchipoayenu
bhooprajalu viroadhula-yuddambu laaDi yaa
manoaj~namaina gaanamu-nalakshyapeTTiri
paapaatmulaaraa, vinuDi-Sree yeasu prabhuvu
mee paapabhaara mantayu-vahinchi vachchenu
taapatrayambu nantayu-daanea vahinchunu
sampoorNa Saanti Sampada-lanugrahinchunu
sadbhaktulu stutinchina-ee satyayugamu
ee veaLa nea nijambugaa-sameepamaayenu
aa kaalamandu ksheamamu-vyaapinchuchunDunu
aa divya gaana mandaru-paaDuchu neppuDu
శ్రీ రక్షకుండు పుట్టగా-నాకాశసైన్యము
ఇహంబున కేతెంచుచు-ఈ పాట పాడెను
పరంబునందు స్వామికి-మహా ప్రభావము
ఇహంబునందు శాంతిని-వ్యాపింపనీయుడు
ఆ రమ్యమైన గానము-ఈ వేళ మ్రోగును
సంతుష్టులైన భక్తులు-ఆ ధ్వని విందురు
ప్రయాసపడు ప్రజలు-దుఃఖంబు తీరగా
ఆ శ్రావ్యమైన గానము-ఈ వేళ విందురు
పూర్వంబు దూతగానము-భువిన్ వినంబడి
రెండువేల వర్షములు-గతించిపోయెను
భూప్రజలు విరోధుల-యుద్దంబు లాడి యా
మనోజ్ఞమైన గానము-నలక్ష్యపెట్టిరి
పాపాత్ములారా, వినుడి-శ్రీ యేసు ప్రభువు
మీ పాపభార మంతయు-వహించి వచ్చెను
తాపత్రయంబు నంతయు-దానే వహించును
సంపూర్ణ శాంతి శంపద-లనుగ్రహించును
సద్భక్తులు స్తుతించిన-ఈ సత్యయుగము
ఈ వేళ నే నిజంబుగా-సమీపమాయెను
ఆ కాలమందు క్షేమము-వ్యాపించుచుండును
ఆ దివ్య గాన మందరు-పాడుచు నెప్పుడు